గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో ‘దేవర’ ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పూర్తి యాక్షన్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.సెప్టెంబర్‌లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు, హిందీ వెర్షన్ లో భారీ విజయం నమోదు చేసుకుని, బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది.వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయిన చాలా చోట్ల పాత రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయిన దగ్గర్నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది. కాగా ‘దేవర’ ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల కానుంది.
Also Read:Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
అవును దేవర మూవీ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. మనకు తెలిసినంత వరకు యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ బాగున్న భారతీయ సినిమాలకు ఆ దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. అలా ఇప్పటి దాకా టాప్ 1 స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా ఆ తర్వాత బాహుబలి 2, ఇంగ్లిష్ వింగ్లిష్, త్రి ఇడియట్స్, మగధీర, ధూమ్ 3, భజరంగి భాయ్ జాన్, రోబో, పఠాన్, సలార్ లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ దేవర మూవీని కూడా అదే దారిలో వెలుతొంది. అందుకే తాజాగా జూనియర్ అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్స్ లో భాగంగా ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మరి అక్కడ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.