నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరుకానున్నాడు. 10 గంటలకు తనీష్ తన బ్యాంక్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్లతో రావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేయబోతోంది ఈడీ. కెల్విన్ తనీష్ కి మధ్య జరిగిన ఆర్థికలావదేవిలపై స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు అధికారులు. డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా ? అన్న కోణంలో తనీష్ ని ఈడీ విచారించబోతోంది.
Read Also : ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ సౌత్ మూవీ
2017 డ్రగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు. మరో వైపు ప్రధాన నిందితుడు కాల్విన్ మస్కరేన్‌హాస్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్‌ని కూడా ఈడీ అధికారులు విచారించారు. 2017లో కస్టమ్స్ అధికారులు కాల్విన్ మస్కరేన్హాస్, మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో డ్రగ్ రాకెట్ బయటపడింది.