Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఇక ఇప్పటివరకు ఈ వివాదంపై ఏ స్టార్ హీరోకాని, ఏ డైరెక్టర్, నిర్మాతగా కానీ నోరు మెదిపింది లేదు. అయితే తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ వివాదంపై స్పందించారు. టాలీవుడ్ ఉన్న సమస్యలపై ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఉంటారన్న విషయం తెల్సిందే. తాజాగా విశ్వక్ వివాదంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ ” ఈ వివాదం గురించి విన్నాను. అర్జున్ చెప్పిన దాని ప్రకారం కథ మొత్తం విని, షూటింగ్ మొదలుపెట్టే సమయానికి విశ్వక్ షూటింగ్ కు రాలేదు. కథలో అది నచ్చలేదు.. ఇది నచ్చలేదు అన్నప్పుడు కథను ఎందుకు ఒప్పుకోవాలి..?. సినిమా మొదలు పెట్టే ముందు హీరోలు మనకు ఇష్టం ఉందా లేదా? ఆ ప్రొడ్యూసర్ ఇష్టమా లేదా? హీరోకు ఇష్టమా? అన్ని మాట్లాడుకునాకే సెట్ మీదకు రావాలి. ఒక్కసారి సెట్ మీదకు వచ్చాకా ఇలా మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు.
ఒకప్పుడు ఎన్టీఆర్ తో కలిసి కొత్త డైరెక్టర్ పనిచేసినప్పుడు.. ఎన్టీఆర్ ఎప్పుడు ఆయనకు సలహాలు ఇచ్చింది లేదు. మీకు అనుభవం ఉంది కదా.. మీరైనా చెప్పొచ్చు కదా అని ఎన్టీఆర్ ను అడిగితే.. సరే నేను చెప్పాను. సినిమా హిట్ లేదా ప్లాప్ అయ్యింది. ప్లాప్ అయితే నేను తలదూర్చాను అని అంటారు. హిట్ అయితే అదే డైరెక్టర్ కు ఇంకో పడు మంది హీరోలు అవకాశాలు ఇస్తారు.. ఇంకో పది ప్లాపులు వస్తాయి. అదే ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటే.. అతని లక్.. హిట్ అయితే వేరో హీరోతో ఎలా చేయాలో నేర్చుకుంటాడు. ప్లాప్ అయితే అవకాశాల కోసం ఇంకా బాగా కష్టపడి నేర్చుకొని మరి హీరో వద్దకు వెళ్తాడు అని చెప్పారు. నేను అదే ఫాలో అవుతా.. ఇక్కడి విషయంలో అర్జున్ కొత్త డైరెక్టరా అంటే కాదు.. అవుట్ డేటెడ్ డైరెక్టర్ అని అనిపించన్నప్పుడు కథను ఎందుకు ఒప్పుకోవాలి. ఈ మధ్య ఈ హీరోలందరికీ ఇదొక అలవాటుగా మారిపోయింది. కథల విషయంలో వేలు పెట్టడం, ఈ ఇన్వాల్వ్ మెంట్ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
ఒక్కో ప్రొడ్యూసర్ ఒక్కో డైరెక్టర్ ను తీసుకొస్తారు. ఆ డైరెక్టర్ ఒక కథను తీసుకొచ్చి దానికి న్యాయం చేయాలని చూస్తాడు. కానీ, హీరోలు తమకు నచ్చినవి పెట్టాలని ఒత్తిడి తెచ్చి సినిమాలను ప్లాప్ బాట పట్టిస్తున్నారు. వీరందరూ కథల్లో వేలుపెట్టి అది సక్సెస్ అనుకోని.. స్టేజిల మీద యారోగెంట్ గా మాట్లాడి ప్రేక్షకులను విసిగిస్తున్నారు. వారిని ఎగతాళి చేస్తానికి.. నేనే పొడుస్తా .. నేనే పీకుతా.. నేను ఏది చెబితే అది నడుస్తుంది అనే టైపులో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాన్ఫిడెన్స్ ఉండటం వేరు. యారొగెన్స్ ఉండటం వేరు. నేను బ్రహ్మాండంగా చేశాను.. మీరు కూడా చూడండి.. మెచ్చుకుంటారు అని కాన్ఫిడెంట్ గా చెప్పడం వేరు. నేను చేశాను నువ్వు చూడక చస్తావా? అంటే ఎలా?.. నిజం చెప్పాలంటే అర్జున్ కు జరిగింది అవమానమే. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు.. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే. ఇలా ఎవరు చేయకూడదు. విశ్వక్ సారీ చెప్పినా రేపు మరొకరికి ఇలా జరగకూడదు. వింటారు అని చెప్తున్నా.. వినకపోతే నాకేం ప్రాబ్లమ్ లేదు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమాంరెడ్డి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.