Tamannaah : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు మూడు జనరేషన్స్ ను ఓ ఊపు ఊపేసింది. అందం అంటే శ్రీదేవి.. శ్రీదేవి అంటేనే అందం అన్నట్టు ప్రేక్షకుల మదిలో గూడు కట్టుకుంది. అలాంటి శ్రీదేవికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత మళ్లీ ఆమె లాంటి హీరోయిన్ తెరమీద కనిపించట్లేదు. అయితే తాజాగా తమన్నా ఆమెను గుర్తు చేసుకుంది. తాజాగా మిల్కీ బ్యూటీ ఓ ఫ్యాషన్ టూర్ లో పాల్గొంది. ఇందులో ఆమెకు యాంకర్ ఓ ప్రశ్న వేసింది. మీరు ఆన్ స్క్రీన్ లో ఎవరి లాగా నటించాలని అనుకుంటున్నారు అని అడిగారు. తమన్నా క్షణం కూడా ఆలోచించకుండా శ్రీదేవి పేరు చెప్పేసింది.
Read Also : Maruti Suzuki: మారుతీ లవర్స్‌కు షాక్.. మరింత పెరగనున్న కారు ధరలు
“శ్రీదేవి సూపర్ ఐకానిక్. ఆమెకు నేను పెద్ద అభిమానిని. ఆమె లాగా తెరమీద నటించాలని ఉంది. ఆమె అన్ని రకాల పాత్రలు చేసింది. కామెడీ, సీరియస్, డ్రామా ఇలా అన్ని పాత్రలు పోషించింది. అందుకే ఆమెలాగా నాకు తెరమీద పాత్రలు చేయాలని ఉందంటూ చెప్పింది మిల్కీ బ్యూటీ. తమన్నా త్వరలోనే ఓదెల-2 సినిమాతో రాబోతోంది. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఆమె సౌత్ సినిమాలవైపు చూస్తోంది. త్వరలోనే మరో రెండు సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.