Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamannaah: హీరోయిన్ల నటనను పక్కనపెట్టి వాళ్ల బాడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ రంగంలో తరచూ వివాదాలకు కారణమవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అన్నూ కపూర్ తమన్నాపై చేసిన ‘పాల వంటి శరీరం’ (దూధియా బదన్) కామెంట్స్ ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. ఆ సమయంలో ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉన్న తమన్నా.. దాదాపు ఏడాది తర్వాత తొలిసారి ఆ నటుడి మాటలపై పెదవి విప్పారు. తనదైన పరిణతితో ఆయనకు గట్టి కౌంటరే ఇచ్చారు.
‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా చేసిన ‘ఆజ్ కీ రాత్’ స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే ఆ డ్యాన్స్ గురించి మాట్లాడాల్సింది పోయి.. సదరు సీనియర్ నటుడు తమన్నా శరీరాకృతిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. “ఆమె పాల లాంటి తెల్లటి శరీరం, రూపం చూసి పసిపిల్లలు కూడా హాయిగా నిద్రపోతారు.. దేశానికి ఇదో వరం” అంటూ మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నెటిజన్లు ఆయన్ను తీవ్రంగా తప్పుబట్టడంతో.. నొప్పించి ఉంటే సారీ అంటూ కవర్ చేసుకున్నారు.
Also Read
- Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
- Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
- Chhatrapati Shivaji: టీ-సిరీస్ - రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
- Bunny - Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ నటుడు చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురవగా.. తమన్నా చాలా హుందాగా బదులిచ్చారు. “మనం సినిమా రంగంలో ఉన్నప్పుడు చుట్టూ రకరకాల మాటలు వినిపిస్తుంటాయి. అయితే అందులో వేటిని మనసులోకి తీసుకోవాలి, వేటిని వదిలేయాలి అన్న క్లారిటీ మనకు ఉండాలి. ఒక మహిళగా ఇలాంటి చిన్నచూపు వ్యాఖ్యలనే పట్టుకుని కూర్చుంటే జీవితంలో అస్సలు ముందుకు సాగలేం” అని తేల్చి చెప్పారు. తన దృష్టి ఎప్పుడూ కెరీర్, నటనపైనే ఉంటుందని, ఇలాంటి అర్థం లేని కామెంట్లను తాను కనీసం లెక్కచేయనని స్పష్టం చేశారు. నటనను కేవలం డబ్బు కోసమే కాకుండా ఓ బాధ్యతగా భావిస్తానని అందుకే అభిమానులు తనను ఆదరిస్తున్నారని చెప్పారు. వివాదాలు సృష్టించేవారికి తమన్నా ఇచ్చిన ఈ క్లాస్ సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!