Lust Stories: సాధారణంగా సీక్వెల్స్ అనేవి అదే హీరో, హీరోయిన్లను రీపీట్ చేస్తేనే ఆ మ్యాజిక్ కూడా రీపీట్ అవుతుంది. వేరే హీరోహీరోయిన్లను పెట్టి సీక్వెల్ ను తీస్తే.. హిట్ అయితే పర్లేదు.. ఒకవేళ హిట్ కాకపోతే ముందు ఉన్న జంటలనే పొగిడేస్తూ ఉంటారు. వారిని, వీరిని పోల్చి చూస్తూ హిట్అయిన వారే బాగా చేసారని చెప్పుకొస్తారు. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 కూడా అదే విమర్శలను ఎదుర్కొంటుంది. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ లాంటి స్టార్స్ తో నలుగురు దర్శకులు.. నాలుగు స్టోరీస్ ను తెరకెక్కించారు. జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. తమన్నా హాట్ సీన్స్, మృణాల్ కిస్ సీన్స్ తో సిరీస్ మొత్తం పిచ్చెక్కిస్తోంది అనుకున్నారు అభిమానులు.. కానీ, సిరీస్ మొత్తం చప్పగా సాగిందని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమన్నా అంతగా మెప్పించలేకపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ కన్నా మొదటి పార్ట్ లో నటించిన కియారా అద్వానీనే బాగా కనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Rangabali Censor: రంగబలి సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ ఇచ్చారంటే?
తమన్నా ఇంతలా బోల్డ్ సీన్స్ చేయడం ఇదే మొదటిసారి.. ట్రైలర్ లో కానీ, ఆ స్టోరీలో కానీ తమన్నా అందాల ఆరబోత చూసి.. అసలు స్టోరీ మొత్తం తమ్ము అదరగొడుతుంది అనుకున్నారు. అయితే కథ సరిగ్గా లేకపోవడంతో అమ్మడు కేవలం ఆ సీన్స్ కు మాత్రమే పరిమితమయ్యింది అని చెప్పుకొస్తున్నారు. ఇక లస్ట్ స్టోరీస్ లో ఉన్న స్ట్రాంగ్ కథ కానీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ కానీ లస్ట్ స్టోరీస్ 2 లో లేవని తేల్చి చెప్పేస్తున్నారు. కియారా లస్ట్ స్టోరీస్ లో శృంగార కోరికలు ఆపుకోలేని గృహిణిగా కనిపించింది. ఆ పాత్రలో ఆమె చేసిన నటనను ఇప్పటివరకు ఎవరు బీట్ చేయలేదని, తమన్నా కూడా అక్కడ వరకు రాలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన చూస్తే లస్ట్ స్టోరీస్ 2 .. తమ్మూకు ఏ మాత్రం ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదనే చెప్పాలి.