Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు మంచి క్రేజ్ ఉంది. ఆమెకు ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె ఐటెం సాంగ్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా చాలానే చేసింది. అసలే మిల్కీ బ్యూటీ అందాలకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఇక ఐటెం సాంగ్ లో ఈ అమ్మడు చేసే అందాల రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరో సినిమాలో అందాలను ఆరబోసి ఐటెం సాంగ్ చేసింది. రీసెంట్ రైడ్-2 సినిమాలో తమన్నా ఐటెం సాంగ్స్ ఫొటోలు కొన్ని లీక్ అయ్యాయి.
Read Also : Mythri Movie Makers: ఒకే రోజు రెండు భాషలు- రెండు హిట్లు
దీంతో తాజాగా మూవీ టీమ్ నేరుగా నటాషా సాంగ్ ను రిలీజ్ చేసింది. ఇందులో తమన్నా గ్రేస్ మామూలుగా లేదు. తన ఒంపు సొంపులతో ఓ ఊపు ఊపేసింది. యమ హాట్ గా కనిపిస్తూ ఆమె చేసిన డ్యాన్స్ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇంత ఘాటుగా స్టెప్పులేసిన తర్వాత ఈ సాంగ్ కచ్చితంగా వైరల్ అవుతుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ హీరోగా, వాణీ కపూర్ హీరోయిన్ గా రాజ్ కుమార్ గుప్తా డైరెక్షన్ లో వస్తున్న మూవీ రైడ్-2. ఈ సినిమాను 2018లో వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్ గా తీస్తున్నారు. ఇందులో తమన్నా ఐటెం సాంగ్ చేయడంతో ఇటు సౌత్ లో కూడా మూవీ గురించి చర్చ జరుగుతోంది.