తెలుగులో వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకే రోజు రెండు విభిన్న భాషల్లో సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా, రెండింటితోనూ హిట్ కొట్టింది. అసలు విషయం ఏమిటంటే, నిన్న అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు బాబీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో అజిత్ కుమార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయినప్పటికీ, ‘జాట్’ మాత్రం కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. ఇక ముందుగా అజిత్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
Hari Hara Veera Mallu: సిద్ధంగా ఉండండి.. రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ!
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా, తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ‘జాట్’ సినిమా విషయానికి వస్తే, దీన్ని కేవలం హిందీ వెర్షన్‌లోనే రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు.
ఈ రెండు సినిమాల్లో ‘జాట్’ సినిమాను హిందీలో రిలీజ్ చేసి హిట్ కొట్టగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను తమిళంలో రిలీజ్ చేసి హిట్ సాధించారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంగతి పక్కన పెడితే, ‘జాట్’ సినిమాకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించి, హిట్‌లో భాగమైంది.