Tamannaah Bhatia: శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక గత కొంతకాలంగా తమన్నా పేరు హిందీలో బాగా వినిపిస్తుంది. జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లతో అమ్మడు హాట్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ గా మారిపోయింది. ఇక మరోపక్క బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో అమ్మడి ప్రేమాయణం బట్టబయలు అయింది. ఈ ప్రేమ విషయాన్ని తమన్న సైతం ఒప్పుకుంది. మొన్నటి వరకు ప్రేమాగీమా ఏమీ లేదు అని చెప్పిన ఈ జంట.. ఒక్కసారిగా ఒకరిని విడిచి ఒకరం ఉండలేము అన్నట్టు స్టేట్మెంట్స్ పాస్ చేసారు. అతనే సర్వస్వం అంటూ తమన్నా.. నిత్యం ఆమె జపం చేస్తూ ఎప్పుడెప్పుడు పెళ్లి అవుతుందో అంటూ విజయ్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా .. తెలంగాణ కోడలు కాబోతుంది అంటూ నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. అర్రే.. మరి విజయ్ పరిస్థితి ఏంటి.. అని కంగారుపడుతున్నారా .. కంగారేం లేదు.. ఎప్పుడైతే తమన్నా, విజయ్ గురించి బయటకు చెప్పిందో అప్పటినుంచి విజయ్ గురించి ప్రేక్షకులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?
బాలీవుడ్ నటుడు అనగానే విజయ్ ముంబైకి సంబంధించిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం విజయ్.. పక్కా హైదరాబాదీ అని తెలుస్తోంది. అతను పుట్టిపెరిగింది హైదరాబాద్ లోనే. చాలాకాలం ఇక్కడే ఉన్న వారి కుటుంబం.. ముంబైకి షిఫ్ట్ అయ్యిందంట. అక్కడే విజయ్ మోడల్ గా మారడం.. నటుడిగా ఎదగడం జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికీ వారి బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాదులోని ఉన్నారని సమాచారం. ఈ రకంగా విజయ్ హైదరాబాద్ యువకుడు అని చెప్పుకోవచ్చు. ఆ లెక్కన చూస్తే తమన్నా కనుక విజయ్ వర్మను పెళ్లాడితే.. తెలంగాణ కోడలు అయ్యినట్టే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ జంట త్వరలోనే పెళ్ళికి రెడీ అవుతున్నారట. మరి పెళ్లి తరువాత తమ్మూ సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.