సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతా మమహాలక్ష్మీగా పర్మినెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్‌గా వచ్చిన టాలీవుడ్ ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. కానీ మృణాల్ మాత్రం తెలుగు ఆడియన్స్‌కు దూరంగానే ఉంటుంది. ఆఫర్లు రావట్లేదో లేదో వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్ ప్రేక్షకులతో అంటిముట్టన్నట్లే ఉంటుంది.
Also Read : Shahid Kapoor : సౌత్ దర్శకుడు షాహిద్ కు హిట్టు ఇస్తాడా..?
హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్సయ్యింది. కల్కిలో క్యామియోతో సరిపెట్టేసింది. అప్పటి నుండి టాలీవుడ్ న్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్ డేట్ ఇవ్వడానికి ఏడాది టైం తీసుకుంది. రీసెంట్లీ అడివి శేష్ డెకాయిట్‌కు కమిటయ్యింది. నార్త్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన అమ్మడు అక్కడ బిగ్ ప్రాజెక్టులను బ్యాగ్ లో వేసుకుంటోంది. ఆమె చేతిలో ప్రజెంట్ ఐదు సినిమాలుంటే అందులో నాలుగు హిందీ పిక్చర్స్ కావడం గమనార్హం. వరుణ్ ధావన్‌తో హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై, అజయ్ దేవగన్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తోన్న తుమ్ హీ హోలో నటించే గోల్టెన్ ఛాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఒక్కటంటే ఒక్క మూవీ చేస్తోంది. అడివి శేష్ డెకాయిట్‌లో యాక్ట్ చేస్తోంది. శృతి హాసన్ ప్లేసులో రీ ప్లేస్ అయ్యింది. ఇది కూడా హిందీ, తెలుగులో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ లైనప్ చూస్తుంటే టాలీవుడ్‌కు మెల్లిగా దూరం జరుగుతున్నట్లు కనిపిస్తుంది.