కబీర్ సింగ్‌తో బాలీవుడ్ కల్ట్ హీరోగా మారిన షాహీద్ కపూర్ మరోసారి సౌతిండియన్ డైరెక్టర్‌నే నమ్ముకున్నాడా. మరోసారి పవర్ ఫుల్ పాత్రలో యంగ్ హీరో కనిపించబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. షాహీద్‌ను బాయ్ నెక్ట్స్ డోర్ నుండి కమర్షియల్ హీరోగా ఛేంజ్ చేసింది కబీర్ సింగ్. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి కల్ట్ హిట్టిచ్చాడు తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ బ్లాక్ బస్టర్ హిట్టుతో సౌత్ దర్శకులపై నమ్మకాన్ని పెంచుకున్నాడు షాహీద్. అంతకు ముందే ప్రభుదేవా యాక్షన్ జాక్సన్‌తో జస్ట్ క్యామియో అప్పీరియన్స్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో.
Also Read : Mollywood : యంగ్ హీరోకు పోటీగా వస్తున్న సీనియర్ హీరో
కబీర్ సింగ్ ఇచ్చిన ఐడెంటీటీతో వెంటనే మరో టాలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు షాహీద్. జెర్సీ బెడిసి కొట్టడంతో కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి సౌతిండియన్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపాడు. ఈ సారి మాలీవుడ్ డైరెక్టర్ ఆండ్రూస్‌కు దేవాతో ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్లీ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో షాహీద్ రూత్ లెస్ పోలీసాఫీర్ పాత్రలో కనిపించాడు. జనవరి 31న థియేటర్లలోకి వస్తున్న దేవాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. పావేల్ గులాటి హీరోయిన్. బిగ్ బి అమితాబచ్చన్ క్లాసిక్ మూవీ దేవాకు ఇన్సిపిరేషన్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. రిలీజైన ట్రైలర్‌లో కొన్ని సీన్స్ చూస్తుంటే ఫక్తు కమర్షియల్ బొమ్మగా కనిపించబోతుంది. రూ. 85 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాతో షాహీద్‌కు రోషన్ అండ్రూస్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తాడా కబీర్ సింగ్ రికార్డులు తిరగరాయిస్తాడా అనేది చూడాలి.