Syed Sohel Comments on trolling: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హీరో సయ్యద్ సొహైల్ రియాన్ సినిమా గురించి పలు కీలకమైన విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్ అని, ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడని అన్నారు. ఎందుకంటే మనిద్దరం కొత్త వాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనే వాడు ఎందుకంటే నేను అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్లలేదని అన్నారు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఈ సినిమాకు నువ్వు హీరో అని చెప్పి సైన్ చేయించాడని, అలా ఈ మూవీ స్టార్ట్ అయ్యిందని ఆయన అన్నారు. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో నటించడం నాకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొన్న ఆయన మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారని, నేను ఈ సినిమా ఒప్పుకునేప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారని వాళ్లు ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పనులు చేస్తున్నారు అంతా గమనించానని అనాన్రు.
Syed Sohel: డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. సొహైల్ షాకింగ్ కామెంట్స్
ఇక మా దర్శకుడు శ్రీనివాస్ గుడ్ ఫ్యామిలీ పర్సన్, ఆయన మంచి సూచనలు ఇచ్చేవారని అలా ఈ క్యారెక్టర్ బాగా చేశానని చెప్పుకొచ్చారు ఈ క్యారెక్టర్ చేసేప్పుడు మూడు కిలోల బరువున్న ప్రొస్థటిక్స్ ధరించాను, ఆ కొద్ది బరువే నాకు ఇబ్బందిగా అనిపించేది కానీ తొమ్మిది నెలలు అమ్మ మనల్ని మోసేందుకు ఎంత కష్టపడుతుందో మనం ఊహించుకోవచ్చని అన్నారు. మేల్ ప్రెగ్నెన్సీ నిజంగా సాధ్యమైతే కనీసం 20 శాతం మంది మేల్స్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడిన ఆయన అది ఎలా ఉంటుందో ఎక్సీపిరియన్స్ అయ్యేందుకైనా తీసుకుంటారని అన్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేశాక చాలా ట్రోల్స్ వచ్చాయి అంతెందుకు ఈ సినిమా గురించి మా అమ్మ కూడా మొదట్లో ఇలాంటి సినిమా ఏంట్రా అన్నట్టు మాట్లాడింది కానీ సినిమా చూశాక ప్రౌడ్ గా ఫీలయ్యింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావని నన్ను మెచ్చుకుందని సోహెల్ చెప్పుకొచ్చారు.