Syed Sohel says he went into Depression: బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సయ్యద్ సొహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్న సోహైల్ పక్కన హీరోయిన్ గా రూప కొడువాయూర్ నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్ట్ చేశారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లో తన అనుభవాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హీరో సోహైల్. తాను బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అయితే సినిమాలో హీరోగా నటిస్తే నన్ను చూసేందుకు థియేటర్ దాకా వస్తారా అనే సందేహం ఉండేదని అన్నారు. స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కవుట్ అవుతుంది, వాళ్లకు అభిమానులు ఉంటారు కానీ నాలాంటి యంగ్ హీరోస్ వెరైటీ మూవీస్, కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు మన సినిమాలకు వస్తారు అని నమ్మానని అన్నారు.
Upendra: దళితులపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర
అందుకే మిస్టర్ ప్రెగ్నంట్ వంటి న్యూ జానర్ మూవీ చేస్తున్నాననన్న ఆయన ఈ మూవీ చేయడం రిస్క్ అని అనుకోవడం లేదని, నాలాంటి యంగ్ యాక్టర్స్ రొటీన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడమే రిస్క్ అవుతుందని అన్నారు. ఇక ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ ఆలస్యమయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా, ఎందుకంటే ఈ సినిమాపై నాకు చాలా హోప్స్ ఉన్నాయి. ఇది నా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యే సినిమా అని నమ్ముతున్నాను అని అన్నారు. ఈ సినిమా షో చూసిన తర్వాత చాలా మంది మహిళలు అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారని, మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందని అనేందుకు వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని అన్నారు. దీంతో మా ప్రయత్నం సక్సెస్ అయ్యిందనిపించింది కాబట్టి రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.