బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ యాక్టివిస్ట్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి క్రష్ గురించి చెప్పింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు ‘చురా హై దిల్ మేరా’ సాంగ్ చూస్తున్నప్పుడు.. తనకు కాబోయే హజ్బెండ్ అతనే కావాలని అనుకున్నానని ఆమె ఇంటర్వూలో తెలిపింది.
Read Also: Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి..
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌పై తనకు క్రష్ ఉందని తెలిపింది నటి స్వరా భాస్కర్. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా తాను రాహుల్ ద్రావిడ్‌ను కూడా ఆరాధించానని.. తన గది నిండా వీరిద్దరి ఫొటోలు మాత్రేమే ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు. డింపుల్ యాదవ్ గురించి ఆమె తన అభిమానాన్ని బహిరంగంగా పంచుకుంటూ, “డింపుల్-జీ విషయానికొస్తే, నేను ఆమెను చాలా బహిరంగంగా ఆరాధిస్తాను. ఆమె చాలా దయగల, అందమైన మహిళ. ఆమె చాలా మందికి ప్రేరణ అని నేను భావిస్తున్నాను. డింపుల్ తాను నుంచి ఎంతో నేర్చుకున్నానని” స్వరా తన X ఖాతాలో “గర్ల్ క్రష్ అడ్వకేట్” అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా ప్రస్తావించింది.
Read Also:POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష
మహిళలు ఒకరినొకరు ఆరాధించాలి, బహిరంగంగా ఒకరినొకరు ప్రశంసించుకోవాలి అని నేను అనుకుంటున్నాను. దానిలో ఎందుకు తప్పు ఉందో నాకు అర్థం కావడం లేదు.” అంటూ ఆమె షాకిచ్చింది. కానీ పొలిటికల్ డిఫరెన్సెస్ కారణంగా అక్షయ్‌కు తనకు మధ్యన ఊహించుకున్నఫెయిరీ టేల్ ఫెయిల్ అయిపోయిందని చెప్పింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం పెరిగిందని తెలిపింది స్వరా భాస్కర్. కాగా ఈ మధ్య స్వరా.. అఖిలేష్ యాదవ్ భార్యపై తనకు క్రష్ ఉందని చెప్పి ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత తన స్టేట్మెంట్పై క్లారిటీ ఇచ్చింది.