మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మళ్లీ తన సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్నేళ్లుగా కుర్ర హీరో రొహ్మాన్ తో రిలేషన్ లో ఉన్న ఈ భామ ఇటీవలే అతడితో తెగదెంపులు చేసుకుంది. మేము ఫ్రెండ్స్ గా పరిచయం అయ్యాం .. ఫ్రెండ్స్ లానే ఉండిపోతున్నాం.. మా బంధం ఎప్పుడో తెగిపోయింది అంటూ అధికారికంగా బ్రేకప్ గురించి చెప్పేసిన సుస్మిత ప్రస్తుతం లైఫ్ ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తోంది. రోజూ జిమ్ లో కష్టపడుతూ, కొత్త ప్రదేశాలను తిరుగుతూ సింగల్ లైఫ్ స్టార్ట్ చేసింది. ఇక తాజాగా ‘పీస్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటూ తాను మాత్రమే ఉన్న క్లోజప్ ఫోటోతో అభిమానులను పలకరించింది. ఇక దీంతో అభిమానులు మరోసారి సింగిల్ లైఫ్ కి స్వాగతం మిస్. సేన్ అని కొందరు.. బాయ్ఫ్రెండ్ ని వదిలించుకొని సింగిల్ గా పార్టీ చేసుకొంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.