Suryadevara Harika: సాధారణంగా ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. హీరోల కొడుకులు హీరోలు.. డైరెక్టర్ కొడుకులు హీరోలు.. హీరోయిన్ల కొడుకులు హీరోలు.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతోనే బతికేస్తున్నారు చాలామంది. ఇక చాలా రేర్ గా ఒక నిర్మాత కూతురు నిర్మాతగా మారింది. ఆమె ఎవరో కాదు సూర్యదేవర హారిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత చినబాబు పెద్ద కూతురు హారిక గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మ్యాడ్ సినిమాకు నిర్మాతగా ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సాధారణంగా నిర్మాతలు అంటే.. కొంచెం అనుభవం, వయస్సు ఇలా ఉంటుంది అనుకుంటాం.. కానీ, హారిక మాత్రం ఒక పక్క చదువును కొనసాగిస్తూనే.. నిర్మాతగా మారిపోయింది. తన వెనుక తన తండ్రి చినబాబు, అన్న నాగవంశీ ఉన్నారనే ధైర్యంతో ఆమె ముందు అడుగు వేసింది. అదే ధైర్యంతో హిట్ అందుకుంది. ఇప్పటివరకు హారిక వెనుకనుంచి అయితే నడిపించింది కానీ, మీడియా ముందుకు మాత్రం రాలేదు.
Narne Nithin: ఎన్టీఆర్ బావ.. మ్యాడ్ సినిమా చూసి ఏమన్నాడంటే.. ?
ఇక మ్యాడ్ సక్సెస్ మీట్ లో మొదటిసారి ఆమె కెమెరా ముందు కనిపించింది. ఎవరికైమా కెమెరా ముందు.. మైక్ పట్టుకొని మాట్లాడాలంటే తడబడడం సహజం.. హారిక కూడా అలాగే తడబడింది. అయితే అన్న నాగవంశీ పక్కన ఉండి ఆమెతో మాట్లాడించాడు. ” మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. నాకు సపోర్ట్ గా నిలిచిన నాన్న గారికి, వంశీ అన్నకి థాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అని చెప్పుకొచ్చింది. ఇక హారిక లుక్ కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఆమె హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు హారిక హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తుందేమో చూడాలి.