Narne Nithin: ఎన్టీఆర్ బావ.. మ్యాడ్ సినిమా చూసి ఏమన్నాడంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా మ్యాడ్ సినిమాకు కొద్దోగొప్పో హైప్ తీసుకొచ్చింది నార్నే నితిన్. ఎన్టీఆర్ బావమరిది. ఎన్టీఆర్ భార్య ప్రణతి తమ్ముడు కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా మ్యాడ్ ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదనే రిలీజ్ చేసి మరింత హైప్ వచ్చేలా చేశారు.
Suhas: ఏదైమైనా సుహాస్ తెలివి.. ఆర్. నారాయణమూర్తికే సారీ చెప్పి..
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
ఇక సినిమాలో నితిన్ యాక్టింగ్ కూడా అద్భుతంగా ఉంది. డ్యాన్స్, ఫైట్స్ బాగానే హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ ఏమన్నాడో నితిన్ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ” ఈ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే. కళ్యాణ్ అన్న ఇంకా చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టాలి. ఆ హిట్లలో మేము ఉండాలి. ఈ సినిమాని మా అక్క(లక్ష్మి ప్రణతి), బావ(ఎన్టీఆర్) చూశారు. బావకి సినిమా చాలా నచ్చింది. అక్కకి డబుల్, ట్రిపుల్ నచ్చింది. పిల్లలైతే నితిన్ మామ.. నితిన్ మామ అంటూ బాగా ఎంజాయ్ చేశారు. డైరెక్టర్ ని, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వంశీ అన్నకి, హారికకి, చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్” అంటూ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!