కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. భారీ నమ్మకాలు పెట్టుకున్న కంగువ బిగ్గెస్ట్ డిజాస్టర్ అవగా రెట్రో ప్లాప్ గా నిలిచింది. అయినా సరే వెనకడుగు వేయకుండా హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యం లో బ్యాక్ టు బ్యాక్ సినిమలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు సినిమాను ఫినిష్ చేసి, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు.
Also Read : Ritika Singh : కూల్ వెదర్ లో హాట్ ఫొటోస్ తో వేడి సెగలు పుట్టిస్తోన్న రితికా
ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మరొక యంగ్ దర్శకుడితో సినిమాకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఫేం అరుణ్ మాథేశ్వరన్ ఇటీవల సూర్యను కలిసి ఓ కథ చెప్పగా సూర్యకు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేసాడని సమాచారం. సూర్య కూడా అరుణ్ డైరెక్ట్ చేసే సినిమా సూపర్ హిట్ అయితే లోకేశ్ మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ విషయమైన రానున్న రోజుల్లో క్లారిటి వస్తుందేమో చూడాలి. అయితే మాథేశ్వరన్ ఇటివల కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వెలువడ్డాయి. లోకేష్ కూడా నిజమే అనే కన్ఫర్మ్ చేసాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ కోసం అనుకున్న కథను అరుణ్ మాథేశ్వరన్ ఇప్పుడు సూర్యకు చెప్పాడని చెన్నై సినీ వర్గాల టాక్. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో సూర్య చేయబోయే సినిమాను సన్ పిచర్స్ నిర్మించనుంది.