కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఒక పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు. సిరుత్తే శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 స్టార్టింగ్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం సూర్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ఎట్టకేలకి మేకర్స్ రివీల్ చేశారు. ముందుగా సోషల్ మీడియాలో లీక్ అయిన ‘కంగువ’ టైటిల్ కే స్టిక్ అయ్యి దాన్నే మేకర్స్ రిలీజ్ చేశారు. కంగువ అంటూ ‘ఏ పీరియడ్ ఆఫ్ టైమ్’ అని అర్ధం. కంగువ అనేది ‘షోనా’ భాష నుంచి తీసుకున్న పదం, కొన్ని దశాబ్దాల క్రితం నుంచీ జింబాబ్వే అఫీషియల్ లాంగ్వేజ్ గా ‘షోనా’ ఉంది.
లీక్ అయిన టైటిల్ ని మారుస్తారని అంతా అనుకున్నారు కానీ కథకి తగ్గ టైటిల్ కాబట్టి మేకర్స్ చేంజ్ చెయ్యడానికి ఇష్టపడలేదేమో అదే టైటిల్ తో వచ్చేసారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ని ‘దేవి శ్రీ ప్రసాద్’ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మోషన్ పోస్టర్ లో గ్రాఫిక్ వర్క్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF సినిమాలు సౌత్ నుంచి రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకి పైగా రాబట్టాయి. ఇప్పుడు కోలీవుడ్ నుంచి కంగువ రిలీజ్ అయ్యి మొదటి వెయ్యి కోట్ల సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి 2024లో తమిళనాడు నుంచి పాన్ ఇండియా హిట్ వస్తుందేమో చూడాలి. ఈ భారి అంచనాలు ఉన్న సినిమాని తెలుగులో యువీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది.
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/xRe9PUGAzP@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations @kegvraja pic.twitter.com/0uWXDIMCTM
— Studio Green (@StudioGreen2) April 16, 2023