టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతాడు. సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా డిజిటల్ విడుదలకు వెళ్లాయి. చాలామంది సురేష్ బాబు తీరును విమర్శించినప్పటికీ మహమ్మారి కాలంలో నష్టపోవడానికి తాను, తన భాగస్వాములు సిద్ధంగా లేమని సురేష్ బాబు కుండబద్ధలు కొట్టారు. అయితే తాజాగా టిక్కెటింగ్ సిస్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ
తన ఇటీవలి మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా సురేష్ బాబు తక్కువ టిక్కెట్ ధర గురించి, ఈ చర్యతో ఎగ్జిబిషన్ పరిశ్రమ ఎలా ఛిన్నాభిన్నమవుతుంది అనే దానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. “మార్కెట్‌లో ప్రతి ఉత్పత్తికి ఒక ధర ఉంటుంది. సినిమా టిక్కెట్ల ధరలను పరిమితం చేయడం తెలివైన పని కాదు… దీనివల్ల భారీ బడ్జెట్ చిత్రాలు తమ పెట్టుబడులను రికవరీ చేసుకోలేక తీవ్రంగా నష్టపోతాయి. ఒకట్రెండు రోజులు మాత్రమే అమ్ముడయ్యే బ్లాక్ టిక్కెట్ల గురించి చర్చలు జరుగుతున్నాయి. టిక్కెట్ ధరలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత టిక్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్ ఛార్జీలను వసూలు చేయడం కూడా థియేటర్ యజమానులకు చాలా కష్టం అవుతుంది. మన సినిమా పరిశ్రమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎగ్జిబిషన్ పరిశ్రమ నాశనమై పోతుంది’’ అని సురేష్ బాబు అన్నారు.