టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి అలియాస్ డాలీ డ్రీకూజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల సురేఖా సంతాపం వ్యక్తం చేస్తూ.. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.
” ఈ అమ్మను వదిలి నీకు ఎలా వెళ్లాలి అనిపించింది. నువ్వు లేవన్న విషయం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నీతో ఇంకా చాలా విషయాలు పంచుకోవాలి. ప్లీజ్ తిరిగి రా గాయత్రీ.. తిరిగి రా తల్లి.. నిన్ను మిస్ అవుతున్నా డాలీ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా” అంటూ ఎమోషనల్ అయ్యారు. గాయత్రిని సురేఖ కూతురుతో సమానంగా చూసుకునేవారని ఆమె మాటలలోనే తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్ కి నెటిజన్లు సురేఖాను ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు.