టాలీవుడ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ రేట్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నిజానికి సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన అభ్యంతర ఉత్తర్వులను, సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా నిలిపివేసింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా రిలీజ్ డేట్‌కు 90 రోజుల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
Also Read:Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
ప్రస్తుతానికి సినిమా టికెట్ ధరలపై ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పెద్ద సినిమాలకు ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి ప్రీమియర్లతో పాటు టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యం కలిగింది. అయితే పూర్తిస్థాయి మాస్ మసాలా చిత్రంగా ఈ సినిమాని మేకర్స్ ప్రమోట్ చేస్తూ ఉండడంతో, సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాన్ని కోరతారా లేదా అనే అంశం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
