టాలీవుడ్ లో స్టార్ హీరోలు మొత్తం కలుపుకొని ఒక పదిమంది వరకు ఉన్నారు. వారందరు అచ్చ తెలుగు గడ్డమీద పుట్టినవారే.. తాతలు, తండ్రులు, కొడుకులుగా నట వారసత్వాన్ని పెంచుకొంటూ వస్తున్నారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా బాల్య నటుడిగానే చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్.. ఆనతి కాలంలోనే టాలీవుడ్ ‘రాకుమారుడు’ అయిపోయాడు.. ఆ తరువాత టాలీవుడ్ హీరోల్లో ‘ఒక్కడు’ గా మారి సరిలేరు నీకెవ్వరు అని అభిమానులు అనుకొనేలాగా ఎదిగాడు. అయితే ఇంత సూపర్ స్టార్ అయినా కూడా మహేష్ కు ఇప్పటివరకు తెలుగుపై పట్టలేదని తెలుస్తోంది. మహేష్ ప్రెస్ మీట్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ చూస్తే ఆయన ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మహేష్ కు తెలుగు మాట్లాడడం సరిగా రాదని చెప్పుకొస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు మహేష్ కు తెలుగు చదవడం, రాయడం రావట.. దీనికి బలమైన కారణం కూడా ఉందని చెప్పుకొస్తున్నారు. అదేంటంటే.. మహేష్ బాల్యం, స్కూలింగ్ అంతా చెన్నెలోనే జరగడం. దీంతో చిన్నతనం నుంచే మహేష్ తెలుగుకు దూరమయ్యాడు. అందుకే ఇప్పటివరకు మహేష్ కు తెలుగు చదవడం, రాయడం రాదట.. అయితే మరి స్క్రిప్ట్స్ ను ఎలా చదువుతున్నాడు, డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడు అంటే.. స్క్రిప్ట్ ను చదివి వినిపిస్తారట.. డైలాగ్స్ ను దర్శకుడు చెప్పిన వెంటనే గుర్తు పెట్టుకొని స్పాట్ లో చెప్పేస్తుంటాడట. ఆ గ్రాస్పింగ్ పవర్ ఉండడం వలనే భాషతో పెద్దగా ప్రాబ్లెమ్ రాలేదని తెలుస్తోంది. ఇక చెన్నె లో మహేష్ క్లాస్ మేట్ ఎవరో కాదు దళపతి విజయ్.. ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఏదిఏమైనా భాష మీద పట్టులేకపోయినా తెలుగును స్పష్టంగా పలకగలుగుతున్నాడు అంటే మహేష్ చాలా గ్రేట్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. త్వరలోనే ఈ సినిమ సెట్స్ మీదకు వెళ్లనుంది.