సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. సంక్రాంతి పోటీలో గుంటూరు కారంపైనే ఎక్కువ హైప్ ఉంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్… ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు. జనవరి 6న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం రెడీ అవుతున్నారు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాకు గెస్ట్‌లు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే… మహేష్ బాబునే ఓ సూపర్ గెస్ట్ కానీ గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే మాట వినిపిస్తోంది. పవన్, మహేష్ ఇద్దరితో త్రివిక్రమ్‌కి మంచి అనుబంధం ఉంది. దీంతో గుంటూరు కారం ఈవెంట్‌కి పవన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ పవర్ స్టార్ గనుక సూపర్ స్టార్ కోసం గెస్ట్‌గా వస్తే… ఆ స్జేజ్, ఆడిటోరియంతో పాటు హైదరాబాద్ కూడా షేక్ అయిపోవడం ఖాయం కానీ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న పవన్… ఈ ఈవెంట్‌కు వస్తాడని ఖచ్చితంగా చెప్పలేం. మరి… గుంటూరు కారం గెస్ట్ ఎవరైనా వస్తారా? లేదా? అనేది చూడాలి.