సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ కు మహేష్ కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక ఈ గ్యాప్ లో బుధవారం హైదరాబాద్ బెస్ట్ మొబైల్ పేమెంట్స్ యాప్ ‘క్విక్ ఆన్’ని లాంచ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మహేష్. ఈ కార్యక్రమంలో ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారాడు.
” ప్రస్తుతం అందరు స్టార్ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు.. మీరెప్పుడు డైరెక్ట్ హిందీ సినిమా చేస్తున్నారు” అని ఒక జర్నలిస్టు అడగగా.. అందుకు ఏ మాత్రం తడబడకుండా కూల్ గా నాసర్ ఇచ్చాడు మహేష్. ” నేను హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం నేను తెలుగులో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాను.. త్వరలోనే రాజమౌళి తో చేస్తున్న సినిమా పాన్ ఇండియాగా విడుదల కానుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీపై హిందీ నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా.. సౌత్ స్టార్లు మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఒకటే అని చెప్పడం విశేషం. దీంతో అభిమానులు తమ స్టార్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల కన్నడ స్టార్ యష్ కూడా ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పిన విషయం తెల్సిందే. ప్రస్తుతం మహేష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.