Mahesh Babu: తుఫాన్… తుఫాన్ లా పరిగెడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. తన ఇన్స్టా లో మహేష్ బాబు వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేసాడు. ఈ వీడియోస్ చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాడు, ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు. హీరో అంత ఫిట్ అండ్ యంగ్ గా కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది అని తెలియజేస్తూ మహేష్ జిమ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి.
“My Saturday Sizzle Set!! With my favourite skillmill finisher… 😎😎😎 1 minute landmine press, 1 minute kettlebell swings, 1 minute skillmill run!! How many sets can you do???” అంటూ మహేష్ ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియోస్ చూసిన మహేష్ ఫాన్స్, సోషల్ మీడియాలో #MaheshBabu టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ బాబు… SSMB 28 ప్రాజెక్ట్ అయిపోగానే SSMB 29 సినిమా స్టార్ట్ చేయనున్నాడు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి. మరి కొత్త లుక్ లో మహేష్ ఏ రేంజులో కనిపిస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Stock Market: యుద్ధం ముగింపు వార్తలతో.. భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు..
-
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!