Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్నబ్ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,600 కోట్ల మేర తీవ్ర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన ముగించిన కేంద్ర కరువు, తుఫాన్ అధ్యయన బృందం సోమవారం అమరావతి సచివాలయాలలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమైంది. బాధితులను ఆదుకునేందుకు, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా ఉదారంగా నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.
నాలుగు జిల్లాల్లో కేంద్ర బృందం విస్తృత పర్యటన
హోం, వ్యవసాయం, జలవనరులు, జాతీయ రహదారులు, ఆర్థిక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన కేంద్ర ప్రతినిధి బృందం గత కొన్ని రోజులుగా తీవ్ర ప్రభావిత ప్రాంతాలైన బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది. క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలను దగ్గరుండి పరిశీలించిన అధికారులు.. పంట చేతికి వచ్చే కీలక సమయంలో అర్నబ్ తుఫాన్ విరుచుకుపడటంతో వరి, కొబ్బరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read
- Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
- YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
- Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
- Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
ఆర్టీజీఎస్, మనమిత్ర సేవలకు కేంద్ర బృందం ప్రశంసలు
ప్రకృతి విపత్తు సమయంలో ప్రాణ, ఆస్తినష్టాన్ని కనిష్టంగా తగ్గించడంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన ఆర్టీజీఎస్ (RTGS) సాంకేతికత, ‘వాట్సాప్ మనమిత్ర’ సమాచార వ్యవస్థ అత్యంత కీలకంగా వ్యవహరించాయని కేంద్ర బృందం కొనియాడింది. ముందస్తు హెచ్చరికలు, సమాచార వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం పాటిస్తున్న ఈ ‘బెస్ట్ ప్రాక్టీసెస్’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా అధ్యయనం కోసం సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు.. అధికారులకు అభినందనలు
తుఫాను ధాటికి అతలాకుతలమైన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగాలు పడిన శ్రమను కేంద్ర అధికారులు ప్రశంసించారు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు , తీరప్రాంతాల్లో సైతం విద్యుత్ పునరుద్ధరణ, రహదారుల బాగు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం అభినందనీయమని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం చూపిన వేగాన్ని ఉన్నతాధికారుల బృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది.
అర్నబ్ తుఫాన్‌తో ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం
నాలుగు జిల్లాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన
బాధితులను ఆదుకునేందుకు నిధులు కోరిన చంద్రబాబు
ఆర్టీజీఎస్, మనమిత్ర సేవలను ప్రశంసించిన కేంద్ర బృందం
తాజావార్తలు
-
Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
-
Cyclone Murasu: ముంచుకొస్తున్న మురసు.. కీలక హెచ్చరికలు జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ..
-
Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!