Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నమ్మించి ఇంటికి తీసుకెళితే, కట్టుకున్న భార్యతోనే పడక సుఖం వెతికాడు. ఆ నమ్మకద్రోహమే అతడి పాలిట మృత్యువైంది. ప్రాణానికి ప్రాణంగా భావించిన స్నేహితుడే తనను మోసం చేశాడన్న పగ, సముద్రపు ఇసుక తిన్నెల్లో ఓ దారుణ హత్యకు దారితీసింది. సీనియర్ సినీ నటి రాధికా శరత్‌కుమార్ నివాసంలో పనిచేసే మహిళ కుమారుడు అత్యంత కిరాతకంగా హత్యకు గురవడం తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది. కడలూరు జిల్లా సిరువత్తూరుకు చెందిన ఎళిల్సెల్వి.. గత కొన్నేళ్లుగా చెన్నైలో నటి రాధిక వద్ద గృహ సహాయకురాలిగా (పనిమనిషి) పనిచేస్తున్నారు. ఆమె 19 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 27న తల్లిని చూసేందుకు చెన్నైకి వచ్చిన అతడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎన్ని రోజులైనా ఆచూకీ దొరకకపోవడం, ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రశాంత్ అదృశ్యమయ్యే ముందు తన ప్రాణ స్నేహితులైన బన్రుట్టి ప్రాంతానికి చెందిన వేదరాసు, దినేష్‌లతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు కథ బయటపడింది. ప్రశాంత్, వేదరాసు, దినేష్ ముగ్గురూ ఎంతో కాలంగా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ చనువుతోనే వేదరాసు ఇంటికి తరచుగా వెళ్లి వచ్చే ప్రశాంత్.. అతడి భార్యతో సన్నిహితంగా మెలిగి, చివరికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. తాను ఎంతగానో నమ్మిన స్నేహితుడే తన భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడన్న నిజం వేదరాసు దృష్టికి వెళ్లడంతో అతడు రగిలిపోయాడు.
Also Read
- Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
- Aadarsha Kutumbam : మూడు రోజుల్లో 75 కోట్లు.. నిర్మాతల అధికారిక ప్రకటన
- Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
- CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
ఎలాగైనా ప్రశాంత్‌ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న వేదరాసు.. మరో స్నేహితుడు దినేష్‌తో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. మాయమాటలు చెప్పి ప్రశాంత్‌ను పొన్నేరి సమీపంలోని నిర్మానుష్యమైన పళవేర్కాడు బీచ్ వద్దకు తీసుకెళ్లారు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారంపై ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన వేదరాసు, దినేష్ కలిసి ప్రశాంత్‌పై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అనంతరం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, సముద్రపు అలల తాకిడికి ఆనవాళ్లు కూడా మిగలవని భావించి ఇసుకలోనే పెద్ద గొయ్యి తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నిందితులు అంగీకరించిన వాంగ్మూలం మేరకు పళవేర్కాడు తీరానికి చేరుకున్న పోలీసులు.. ఇసుకలో పాతిపెట్టిన ప్రశాంత్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్నేహితుడి భార్యపై మోజు పడి ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులిద్దరిపై హత్య, ఆధారాల ధ్వంసం కేసులను నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!