మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఈషాన్ దర్శకత్వంలో తెరక్కుతున్నఈ సినిమాకు కోన వెంకట్ కథను అందివ్వడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ లో సన్నీ లియోన్ భోరుభోరున ఏడుస్తోంది.. అందుకు సంబంధించిన విడో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఎందుకు సన్నీ ఏడ్చింది.. అంటే ఈరోజు సోమవారం కావడంతో.. మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టి పనిచేయాలని తలుచుకొని అమ్మడు ఏడుపు లంకించుకుంది.. అదేనండి.. చిన్నపిల్లలు కనుక ఆదివారం అంతా ఆడుకొని మండే స్కూల్ కి వెళ్లమంటే ఎలా ఏడుస్తారో అలా అన్నమాట.. చక్కగా లంగావోణీలో ముస్తాబై .. మంచమెక్కి పడుకుని మరీ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
పొట్టపై స్మార్ట్ ఫోన్ పెట్టుకుని..రెండు చేతులు చాచి ఏడుపు ముఖం పెట్టింది.. కంట కన్నీరు అయితే చిందులేదు కానీ లోపల బాధ ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యో సన్నీ నీకు ఎన్ని కష్టాలు వచ్చేసాయి అంటూ నెటిజన్లు సన్నీని ఓదారుస్తున్నారు. ఇక ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరనుంచి ఎలాంటి ఫన్నీ వీడియోలు వరుసగా రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.. మొన్నటికి మొన్న విష్ణు సన్నీ, పాయల్ ను ఏడిపించిన వీడియో వైరల్ గా మారింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా విష్ణుకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.