సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంలో సుమంత్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ బ్యాచిలర్ గా సుమంత్ కనిపించబోతున్నాడు. సినిమాలో ఈ హీరోకు పెళ్లంటే అలర్జీ అంట. అంతేకాదు రిలేషన్ షిప్ స్టేటస్ “?” అంటే ప్రశ్నార్థంతో పెట్టడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ చిత్రంలో సుమంత్ పాత్ర బాగా వంట చేయగలడట, ఒంటరిగా ఉంటాడట. ఈ క్వాలిఫికేషన్స్ తంటాలన్నీ సుమంత్ రీమ్యారేజీ కోసమేనని అర్థమవుతోంది.
ఇటీవల సుమంత్ రెండో పెళ్లి అనే ఫేక్ న్యూస్ తో సినిమాను బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలోని కీలకపాత్రధారుల పాత్రలను ఇలా స్పెషల్ పోస్టర్ తో పాటు వారి గురించి తెలియజేస్తూ విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు సుహాసిని ఇన్‌స్పిరేషనల్ రోల్‌లో, ఎంటర్‌ప్రెన్యూరర్, ధైర్య, సాహసవంతమైన సింగిల్ మదర్ ‘సుజా’ పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. నిన్న పోసాని కృష్ణ మురళిని లాయర్ గా పరిచయం చేశారు.