“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ టీమ్‌కి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో సుకుమార్ మాట్లాడుతూ సుమ కనకాలకి తొలి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఇతర స్టార్ హీరోయిన్లను ప్రశంసించారు. “గ్యాంగ్ లీడర్ సమంత ఇక్కడ లేదు. ఆమెతో పాటు, సాయి పల్లవి, కీర్తి సురేష్, రష్మిక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ హీరోయిన్లుగా ఉన్నారు” అన్న సుకుమార్… రష్మికకు తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఆనందోత్సాహాలతో నాన్‌స్టాప్‌గా అరుస్తూనే ఉన్నారు. దీంతో సుకుమార్ “సాయి పల్లవి లేడీ సూపర్ స్టార్” అంటూ ఆకాశానికెత్తేశారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు” మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Aadavallu Meeku Johaarlu Pre Release Event : శర్వానంద్ ప్రామిస్… నిలబెట్టుకుంటాడా?