Sukumar Assistant Debuting with Sree Vishnu Movie: ఈ మధ్య కాలంలో సుకుమార్ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి హిట్స్ కొడుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఆయన శిష్యుడు బుచ్చిబాబు అయితే మొదటి సినిమాతోనే వంద కోట్లు కలెక్షన్లు సాధించాడు. మరో శిష్యుడు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. అలాగే ఇంకా చాలామంది శిష్యులు సినిమాలు చేశారు. కాకపోతే కొన్ని హిట్లుగా నిలిస్తే కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు మరో సుకుమార్ శిష్యుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సామాజవరగమనతో మొదలుపెట్టి వరుస హిట్లతో దూసుకు పోతున్న శ్రీ విష్ణుని ఆయన హీరోగా ఎంచుకున్నాడు. ఇప్పటికే శ్రీ విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సామజవరగమన హీరోయిన్ మౌనిక రెబా జాన్ ఎంపికైంది. ఈ సినిమాకి సంబంధించిన మొదటి ప్రకటన రేపు వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Rashmika Mandanna: ప్రేమలో మోసపోకుండా ఉండడం ఎలా? అని తెలుసుకునే పనిలో రష్మిక
సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లైట్ బాక్స్ మీడియా అండ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. ఇక అంతేకాక ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిందని వీలైనంత త్వరలో మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కి కూడా సినిమా యూనిట్ ప్లాన్ చేయబోతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సహా ఇతర విషయాలను రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో కూడా మరో హిట్ అందుకుంటాడని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. మరి శ్రీ విష్ణు ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు రావాల్సిందే.