Rashmika Mandanna Reading The Spanish Love Deception: కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం బిజీ హీరోయిన్స్ లో ఒకరిగా ఉంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కూడా మెరుస్తోంది. తమిళ్ లో కూడా చిన్న హీరోలతో కాకుండా బడా హీరోలతోనే ప్రాజెక్టులు పడుతున్న ఈ భామ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా తన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు తెలిసేలా స్టేటస్ పెడుతూ వస్తోంది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తాను ఒక పుస్తకం చదువుతున్నట్టు అప్డేట్ చేసింది. ఆ పుస్తకాన్ని తనకు వేరే ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతూ ఆమె స్టోరీలో రాసుకువచ్చింది. ఆ పుస్తకం పేరు స్పానిష్ లవ్ డిసెక్షన్. ఈ పుస్తకం 2021లో రిలీజ్ అయిన బెస్ట్ సెల్లర్ నవల్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
Ram Charan: రామ్ చరణ్ ధరించిన షర్ట్ రేటు అన్ని వేలా? వామ్మో!
ప్రేమలో మోసాన్ని గురించి ఉన్న ఈ పుస్తకం రష్మిక చదువుతున్నదంటే ఆమె కూడా ప్రేమలో ఉన్న మోసాన్ని కనిపెట్టడం ఎలా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందేమో అని ఆమె స్టేటస్ చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో ఆమె పాత్ర గురించి ఈ మధ్యనే అప్డేట్ రాగా శ్రీవల్లి గురించి చర్చనీయాంశమైంది. పుష్ప 2 సినిమాలో శ్రీవల్లిది కీలక పాత్ర అంటూ రష్మిక మందన తాజాగా కామెంట్స్ చేసింది. ఇక రష్మిక మందన చేతిలో పుష్ప 2 సినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలు ఉన్నాయి. అలాగే హిందీలో కూడా ఆమె ఒక సినిమా చేస్తోంది.