Sudigali Sudheer Thanks his fans : బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’ను డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా రిలీజ్ దగ్గర పడిన క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, దర్శకుడు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ నాకు మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన అరుణ్ కి థాంక్స్, నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చిందని అన్నారు.
Kiraak RP: ఐఏఎస్ అవ్వాల్సిన అమ్మాయితో లవ్.. సీక్రెట్ గా పెళ్లాడిన కిరాక్ ఆర్పీ
డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉందని, ఆమె నటిస్తూ ఉంటే ఎంతో కాంపిటేటివ్‌గా అనిపిస్తుందన్నారు. మా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా? అనుకుంటున్న టైంలోనే బెక్కెం వేణుగోపాల్ సాయం చేశారని, మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేలా హెల్ప్ చేశారన్నారు. ఇక గెటప్ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.. మీ అభిమానం నాకు దక్కేది కాదని పేర్కొన్న సుధీర్ వాళ్ల వల్లే మీ అభిమానం దొరికిందని అన్నారు. అభిమానులను ఉద్దేశిస్తూ మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేనని అన్నారు. గాలోడు సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది, ఇప్పుడు మంచి సినిమాలు ఇస్తే ఇంకా ప్రేమిస్తారు అని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారని అందుకే ఇకపై కొత్త కంటెంట్, మంచి సినిమాలు తీస్తానని అన్నారు. ఇది కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం, మీకు నచ్చితే పది మందికి చెప్పండి, 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండని సుధీర్ అన్నారు.