Kiraak RP Married his love intrest Lakshmi Prasanna at Vishakapatnam: జబర్దస్త్ షోలో కిర్రాక్ ఆర్పీ ఓ టీమ్ మెంబర్ గా ఎంటర్ అయి టీమ్ లీడర్ స్థాయి దాకా వెళ్లి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మామూలు టీమ్ మెంబర్ గా ఎంటర్ అయినా తనదైన పంచులతో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ టీమ్ లీడర్ అయిపోయాడు. ఇక కిర్రాక్ ఆర్పీ టీమ్ తో చాలా కాలం ప్రేక్షకులను అలరించే వాడు. అయితే తరువాతి కాలంలో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన ఆయన షో మీద రకరకాల ఆరోపణలు గుప్పించాడు. దర్శకుడిగా కూడా ఒక సినిమా మొదలు పెట్టాడు కానీ అది ఎందుకో పట్టాలు మాత్రం ఎక్కలేదు. ఇక అలాంటి ఆయన ఆ తరువాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ మొదలు పెట్టి మంచిగా సంపాదిస్తున్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు సైలెంటుగా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసి, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.
Mansoor Ali Khan -Chiranjeevi: ఏమయ్యా మన్సూర్ మా చిరంజీవి గురించా నువ్ మాట్లాడేది?
వీరి పెళ్లి ఈరోజు అంటే నవంబర్ 29 బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా వైజాగ్ లో జరిగింది. అయితే ఎంగేజ్మెంట్, చేపల పులుసు ప్రమోషన్స్ ధూమ్ దాంగా చేసిన ఆర్ఫీ ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఇలా గప్ చుప్ గా పెళ్లి చేసుకోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇదే అంశం మీద మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితమే తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని.. ఆ ఎంగేజ్మెంట్ కు సినీ తారలు, ప్రముఖులు వచ్చారని అన్నారు. ఇప్పుడు వైజాగ్ లో చేసుకోవడానికి కారణం.. బంధువుల సమక్షంలో చేసుకోవాలని అనుకున్నాం, అందుకే ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, పక్కనే బీచ్ ఉంది.. అలలు వస్తూ ఉంటాయి.. చల్లని గాలి.. వస్తుంది అందరికీ బాగుంటుందని ఇక్కడే చేసుకున్నామని వెల్లడించారు. ఇక ఆర్ఫీ కమెడియన్ గా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్న లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని చూసి ఇష్టపడి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను ప్రేమలో పడేసినట్టు ఎన్నో ఇంటర్వ్యూలలో వెల్లడించారు.