Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో బాగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గాలోడు సినిమా హిట్ టాక్ అందుకోవడంతో ప్రస్తుతం గోట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక గాలోడు సినిమా కన్నా ముందే కాలింగ్ సహస్ర అనే పేరుతో సుధీర్ ఒక సినిమా చేశాడు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా నవంబర్ లోనే రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హిప్ క్రియేట్ చేస్తున్నారు.
Rana Daggubati: ఆ కంపెనీ అమ్మేశా.. నాన్న, నేను మాట్లాడుకోవడం మానేశాం
తాజాగా కనుల నీరు అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. వీడియోను బట్టి ఇది బ్రేకప్ సాంగ్ అని అర్ధం అవుతుంది. ఎంతో ప్రేమించిన అమ్మాయి దూరమైతే.. ఆ ప్రేమికుడి ఆవేదన ఎలా ఉంటుంది అనేది సుద్దాల అశోక్ తేజ్.. తన లిరిక్స్ లో స్పష్టంగా చూపించాడు. మోహిత్ రహ్మానియాక్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సాంగ్ ను యాజిన్ నిజార్ తన అద్భుతమైన గొంతుతో ఆలపించాడు. ఇక వీడియోలో సుధీర్ బ్రేకప్ బాధతో ఏడుస్తూ కనిపించి.. అభిమానులను కూడా ఏడిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.