నైట్రో స్టార్ సుధీర్ బాబు తన యాక్టింగ్ స్కిల్స్ ని ముందెన్నడూ లనంతగా ప్రెజెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కమెడియన్, రైటర్, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ‘మామ మశ్చీంద్ర’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ లుక్ పరంగా పెద్దగా చేంజ్ చూపించని సుధీర్ బాబు ఈసారి మాత్రం ఒకే సినిమాలో మూడు లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆడియన్స్ ని స్వీట్ షాక్ ఇచ్చే రేంజులో మామ మశ్చీంద్ర సినిమా నుంచి రెండు పాత్రలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ‘దుర్గ’ పాత్రలో సుధీర్ బాబు చాలా లావుగా కనిపించాడు, ఆ తర్వాత రిలీజ్ చేసిన పరశురామ్ లుక్ లో సుధీర్ బాబు సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించాడు. ఈ రెండు పోస్టర్స్ లో కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించాడు సుధీర్ బాబు. లేటెస్ట్ గా మామ మశ్చీంద్ర సినిమా నుంచి మూడో పాత్ర ‘డీజే’ లుక్ ని రివీల్ చేశారు. సుధీర్ బాబు ఈ పోస్టర్ లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఇది సుధీర్ బాబు రెగ్యులర్ గా కనిపించే లుక్ లానే ఉంది. మరి ఈ మూడు వేరియేషన్స్ చూపిస్తూ సుధీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.
Read Also: NTR: శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తున్నా
The coolest of 'em all! 😎 Meet DJ#MaamaMascheendra#SBasDJ@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/HdExLjzbHb
— Sudheer Babu (@isudheerbabu) March 7, 2023