ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ లోనూ అలరించారు సుధీర్. విలక్షణంగా కనిపించాలని సుధీర్ తపించే తీరుకు ఆయన నటించిన ‘హంట్’ చిత్రమే పెద్ద నిదర్శనం. అందులో…
నైట్రో స్టార్ సుధీర్ బాబు తన యాక్టింగ్ స్కిల్స్ ని ముందెన్నడూ లనంతగా ప్రెజెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కమెడియన్, రైటర్, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ‘మామ మశ్చీంద్ర’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ లుక్ పరంగా పెద్దగా చేంజ్ చూపించని సుధీర్ బాబు ఈసారి మాత్రం ఒకే సినిమాలో మూడు లుక్స్ లో కనిపించనున్నాడు.…