Suchitra’s comments about Dhanush and Aishwarya creates New Tension: కొన్నేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో సెలబ్రిటీల సన్నిహిత ఫొటోలు విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో నిక్కీ గల్రానీ, త్రిష, రానా, అనిరుధ్, ధనుష్ వంటి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర వీటిని విడుదల చేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేయడం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కస్తూరి రాజా తనయుడు ధనుష్, తుళ్లువతో ఆహలా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు, అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది.
Tabu-Dune Prophecy: హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో ‘టబు’!
ఆ తర్వాత కాదల్ కొండేన్లో తన సత్తా చాటడంతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాదల్ కొండేన్ తర్వాత ఆయన ఇప్పటివరకు 49 సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా గీత రచయిత, గాయకుడు మరియు దర్శకుడు అయిన ధనుష్ పవర్ పాండితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు తన 50వ సినిమా రాయన్‌కి తానే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో పార్టీ ఫొటోలు, సెలబ్రిటీల సన్నిహిత ఫొటోలు ప్రచురితమయ్యాయి.
ఇది కాస్త కలకలం రేపింది. ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ పేజీ ద్వారా విడుదల చేస్తున్నట్లు అప్పట్లో చెప్పుకున్నారు. ఇక ఇదే అంశం గురించి ప్రముఖ తమిళ మ్యాగజైన్ కుముదం యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ భర్త కార్తీక్ స్వలింగ సంపర్కుడని వెల్లడించింది. అంతేకాదు ధనుష్ మరియు ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని మరియు మరొకరికి నమ్మకద్రోహం చేశారని ఆమె పేర్కొంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్‌ని పెళ్లి చేసుకున్న సమయంలో వేరే వాళ్లతో డేటింగ్ చేస్తోందని ఆమె ఆరోపించింది. అదేవిధంగా ధనుష్‌కి పలు అఫైర్స్ ఉన్నాయని సుచిత్ర తెలిపింది. ధనుష్‌కు తెల్లవారుజామున 3 గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ గ్రూప్ ఉందని, ఆ పార్టీలలో వారు ఏ “పదార్థం” వినియోగిస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఆమె చేసిన ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారి తమిళ చిత్ర పరిశ్రమలో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు ధనుష్ అభిమానులు సుచిత్ర వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు, ఆమె డిప్రెషన్‌లో ఉన్నందున ఆమె వాటిని చేస్తుందని పేర్కొన్నారు.