Tabu In Hollywood Series Dune Prophecy: టాలీవుడ్, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న సీనియర్ హీరోయిన్ ‘టబు’.. ఇప్పుడు హాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘డ్యూన్: ప్రాఫెసీ’లో ఆమె నటించనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ మ్యాగజైన్ వెల్లడించింది. డ్యూన్ వెబ్ సిరీస్‌లో ‘సిస్టర్ ఫ్రాన్సెస్కా’ పాత్రలో టబు నటించనున్నారు. విషయం తెలిసిన ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
డ్యూన్: ప్రాఫెసీలో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించనున్నారు. బలమైన, తెలివైన, ఆకర్షణీయమైన పాత్ర అది. సిరీస్‌కు ఈ పాత్ర ఎంతో కీలకం. కచ్చితంగా టబు శాశ్వతమైన ముద్ర వేస్తారు. ఒకప్పుడు చక్రవర్తి ప్రేయసిగా ఉన్న ఆమె.. తిరిగి ప్యాలెస్‌కు రావడంతో ఇది మొదలువుతుంది’ అంటూ టబు పాత్ర గురించి సదరు మ్యాగజైన్ పేర్కొంది. ఇటీవలి కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, సమంతలు హాలీవుడ్‌లో నటించిన విషయం తెలిసిందే.
Also Read: Kiara Advani: ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2024లో కియారా అద్వానీ!
డ్యూన్: ప్రాఫెసీ సిరీస్‌ను 2019లో ప్రకటించారు. డ్యూన్: సిస్టర్‌హుడ్ పేరుతో ఇప్పుడు రానున్నట్లు తెలిపారు. మనిషి మనుగడకు ముప్పు తెచ్చే శక్తులతో హర్కొనెన్ సిస్టర్స్ ఎలా పోరాడారనే అంశంపై ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘సిస్టర్‌హుడ్ ఆఫ్ డూన్’ నవల ఆధారంగా ఈ సిరీస్ రానుంది. ఇందులో ఎమిలీ వాట్సన్, ఒలివియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, జోహ్డి మే, మార్క్ స్ట్రాంగ్, సారా-సోఫీ బౌస్నినా, జోష్ హ్యూస్టన్, క్లో లీ, జాడే అనౌకా, ఫాయోలియన్ కన్నింగ్‌హామ్, ఎడ్వర్డ్ డేవిస్, అయోఫ్ హిండ్స్, క్రిస్మ్‌లిన్ బ్రూన్ కీలక పాత్రల్లో నటించనున్నారు.