గత కొన్ని రోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రైవసీ కారణంగా అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్ళికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట. అంతేకాదు సెలెబ్రెటీలకు షరతులు కూడా విధిస్తున్నారట ఈ లవ్ బర్డ్స్. స్పష్టంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్‌లకు, ఫోటోలకు, లొకేషన్ షేరింగ్ వంటి వాటికి అనుమతి లేదు.
Read Also : వేప రసం లాంటి నిజం… మెల్లగా దిగుతుంది… నెటిజన్ కు డైరెక్టర్ రిప్లై
వివాహ హాజరు గురించి వెల్లడించకూడదు. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకోకూడదు. సోషల్ మీడియాలో లొకేషన్ షేరింగ్ లేదు. అతిథులు వేదిక నుండి బయలుదేరే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. వెడ్డింగ్ ప్లానర్ల నుండి అనుమతి తీసుకున్న తర్వాతే అన్ని ఫోటోలు పోస్ట్ చేయొచ్చు. వివాహ వేదిక వద్ద ఎలాంటి వీడియోలు లేదా రీల్స్ చిత్రీకరించకూడదు.
పెళ్లిలో గురించి ఎలాంటి లీక్స్ కాకుండా ఉండేందుకు డ్రోన్‌లు ఏమైనా కన్పిస్తే కఠిన చర్యలు. ఫొటోగ్రాఫర్లు బయట వధూవరుల ఫోటోలను క్లిక్ చేయకుండా ఉండటానికి ఈ జంట పెళ్లి వేదిక వద్దకు హెలికాప్టర్‌ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ హక్కులను ఓ అంతర్జాతీయ మ్యాగజైన్‌కు విక్రయించినట్లు సమాచారం. ఇంతలో కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కత్రినా, విక్కీ తమ అతిథి జాబితాను మళ్లీ మరోసారి పరీక్షిస్తున్నారని కూడా వినబడుతోంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే అతిధులను కొంత మందిని తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా కన్పిస్తోంది.