గత కొన్ని రోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రైవసీ కారణంగా అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్ళికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట.…