యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కూడా నటిస్తున్నారు.
Also Read : Delhi High Court : ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజోల్, ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజోల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందట. ఇది నిజమైతే, ఇది ఆమె కెరీర్‌లో మరో డిఫరెంట్, పవర్‌ఫుల్ పాత్రగా నిలుస్తుందండనడంలో సందేహం లేదు. ప్రశాంత్ నీల్ గత చిత్రం KGF – 2 లో బాలీవుడ్ నటి రవీనా టండన్ ను కీలకమైన పాత్రలో పవర్ఫుల్ గా చూపించాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ – నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో కాజోల్ కు మంచి రోల్ ఉండే అవకాశం ఉంది. భారీ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.