మదగజరాజా ఊహించని విజయంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు కోలీవుడ్ యాక్టర్ విశాల్. 12 ఏళ్ల పాటు ల్యాబ్‌లో మగ్గి మగ్గి ఎట్టకేలకు ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చేసింది. అస్సలు ఎక్స్ పర్ట్ చేయని రిజల్ట్ చూసి టీం కూడా సంభ్రమాశర్చంలో మునిగిపోయింది. కోలీవుడ్ స్టార్ విశాల్ మదగజరాజా హిట్టును బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. దర్శకుడు సుందర్ సి కూడా క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలోకే వేశాడు. రాదు అనుకున్న సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల టైంలోనే తీవ్రమైన జ్వరంతో వణుకుతూ కెమెరా కంటికి చిక్కాడు విశాల్. దీంతో హీరోపై చెప్పలేనంత పాజిటివిటీ క్రియేటయ్యింది. మొత్తానికి మదగజరాజా బొమ్మ కూడా అదుర్స్ అనిపించుకుంది.
Also Read : RGV : నా కళ్లు మూసుకుపోయాయి.. ఇకపై మంచి సినిమాలే చేస్తా
ఎలాగో లైమ్ లైట్లోకి వచ్చేశాను అనుకున్న విశాల్ అప్ కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూన్ షేర్ చేసుకున్నాడు. హిట్ సినిమా తుప్పరివాలన్ సీక్వెల్ చేస్తున్నానని వెల్లడించిన ఈ వర్సటైల్ హీరో ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్నట్లు చెప్పాడు. విశాల్ ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నాడు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్ తో పాటు డీమాంటీకాలనీ ఫ్రాంచేజీ మూవీస్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో కొలబ్రేట్ అవుతున్నారు. అలాగే 2015లో విడుదలై హిట్టు అందుకున్న అంబాలా కూడా తర్వలో రీరిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు విశాల్. టోటల్ గా మదగజరాజా ఊహించని విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్ హీరో