Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక యూనిక్, పవర్ ఫుల్ కథతో రూపొందనుందని అంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టును కొన్ని నెలల క్రితమే ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇప్పుడు తాజాగా మేకర్స్ ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అని అనౌన్స్ చేస్తూ ఈ రోజు, రేపు ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు వస్తాయి రెడీగా ఉండమని పేర్కొన్నారు.
Kushi: దేవరకొండ ‘ఖుషీ’ని వదలట్లేదు!
ముందుగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేసిన మేకర్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో సెల్వరాఘవన్ ను చూపించారు. ఇక ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని చెబుతూ కొంతమందిని ప్రకటించారు కూడా. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారని ఆ తరువాత క్రాక్, బిగిల్, మెర్సల్, ఇటివలే ‘జవాన్’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పని చేసిన స్టార్ డీవోపీ జీకే విష్ణు.. ఈ సినిమాతో మరోసారి రవితేజ, గోపీచంద్ మలినేనితో కలిసి పని చేయనున్నారని వెల్లడించారు. ఇక అలాగే పాపులర్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఈ సినిమా కోసం పని చేయనున్నారు. ఇక హీరోయిన్ గా ముందు రష్మిక మందన్నను అనుకున్నా డేట్స్ సమస్యల వలన ఇప్పుడు ఆ ప్లేసులోకి కృతి శెట్టి వచ్చిందని అంటున్నారు, అయితే అధికారికంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు. ఇక రవితేజ ఈ సినిమాలో మునుపెన్నడూ నటించని ఒక పాత్రలో నటించనున్నారని అంటున్నారు.