Kushi still trending at #7 position in Netflix Top 10: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి .ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించాడు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించిన ఖుషి సినిమా లో విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుందనే చెప్పాలి.
Narsimha Nandi: “ప్రభుత్వ సారాయి దుకాణం” పేరుతో సినిమా మొదలెట్టిన నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఇక థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ ఖుషీ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి అక్కడ కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయిన చాలా రోజులు టాప్ 1గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోందని, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో కనుక పరిశీలిస్తే టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ గా ఉందని తాజాగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా మీద అంచనాలు ఏర్పరచింది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్.