Suresh Gopi: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదు. స్టార్లకే కాదు వారి కుటుంబానికి కూడా ఈ ట్రోల్స్ బాధపెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు కొంతమంది ట్రోలర్స్. చాలామంది ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే.. ఇంకొందరు.. వారికి గట్టి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు. తాజాగా ఒక స్టార్ హీరో కూతురు కూడా అదే పని చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఆమె ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి కుమార్తె భాగ్య. సురేష్ గోపి తెలుగువారికి కూడా సుపరిచితుడే. ఒకప్పుడు పోలీస్ హీరో అని ఆయనను పిలిచేవారు. ఇక ప్రస్తుతం ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. ఆయన కుమార్తె భాగ్య.. ఈ మధ్యనే కెనడా లోని ఓ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవడానికి ఆమె మలయాళ సాంప్రదాయ దుస్తులను ధరించింది. నిండైన చీరకట్టు ధరించి.. ముక్కుకు ముక్కుపుడక పెట్టుకొని మలయాళీ యువతిగానే ఆ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Megha Akash: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరంటే..?
ఇక ఈ ఫోటోపై ఒక నెటిజెన్.. ” గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నందుకు శుభాకాంక్షలు.. మీరు ఇకపై చీరలు పక్కన పెట్టి వెస్ట్రన్ డ్రెస్ లు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్నవారు చీరలు కడితే బాగుండవు. చీరలు మీకు సెట్ అవ్వడం లేదు. వెస్ట్రన్ డ్రెస్ ల్లో మీరు చాలా బాగుంటారు.. సన్నగా కనిపిస్తారు” అని రాసుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ కు భాగ్య గట్టి కౌంటర్ ఇచ్చింది. ” మీ ఉచిత సలహా కు ధన్యవాదాలు. నా బరువు గురించి మీకెందుకు.. ఇది మీకు సంబంధించిన విషయం అస్సలు కాదు. కనుక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటాను. కేరళ సంస్కృతికి తగ్గట్లుగా నేను గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చీరను ధరించాను. ఇతరుల మాదిరిగా శరీరం కనిపించే డ్రెస్ లు వేసుకోలేదు. ఇలాంటి కామెంట్స్ చేయడం మానేసి మీ పని పై మీరు దృష్టిని పెడితే బాగుంటుంది” అని చెప్పుకొచ్చింది. ఇన్ డైరెక్ట్ గా నీ పని నువ్వు చూసుకో అని చెప్పిందన్న మాట. ఇక భాగ్య సమాధానానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.