Mahesh Babu:గుంటూరు కారం మ్యానియా తగ్గిపోయింది. హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ ఏడాది మహేష్ వెండితెరపై కనిపించాడు. అదేంటి ప్రతి ఏడాది కనిపిస్తాడుగా అని అంటారేమో.. ఈసారి ఎన్నేళ్లకు కనిపిస్తాడో చెప్పడం కష్టం. అదే ఎందుకు అంటే.. మహేష్ తన తదుపరి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు కాబట్టి. ఆయన సరదా సరదాకే ఒక్కో సినిమా రెండేళ్లు తీసుకుంటాడు.. అలాంటింది మహేష్ బాబు.. అడ్వెంచర్ సినిమా అంటున్నాడు.. ఎన్నేళ్లు పడుతుందో వారికే తెలియాలి. అందుకే ఈ ఏడాది ఫ్యాన్స్ కు మహేష్ ఫుల్ మీల్స్ పెట్టాడు. తన నటనతో, లుక్స్ తో, డ్యాన్స్ తో అభిమానుల కడుపు నింపేశాడు. ఇక ఎట్టకేలకు గుంటూరు కారం సినిమాను ఫినిష్ చేసి.. SSMB29 లోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం కొన్నిరోజుల క్రితం మహేష్ జపాన్ వెళ్లిన విషయం తెల్సిందే. స్క్రిప్ట్ లో భాగంగా అక్కడ కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి మహేష్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా మహేష్.. జపాన్ లో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అడవుల్లో మహేష్.. తిరుగుతూ కనిపించాడు. ఆయనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే అతను టెక్నీషియనా.. ? లేక వేరే వ్యక్తా.. ? అనేది తెలియదు. ఇక ఈ ఫోటోలతో బాబు అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నాడని అర్ధమవుతుంది. దీంతో SSMB29 ని ట్రెండ్ చేయడం మొదలుపెడదామా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.