నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కెరీర్ లో #SSMB28 గా వస్తున్న సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పూర్తి వివరాలను చిత్రబృందం ప్రకటించింది.
పూజా హెగ్డే మరోసారి మహేష్ బాబు పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదివరకు వీరిద్దరూ ‘మహర్షి’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. ‘అల వైకుంఠపురములో’ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ ఆయనకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.