SSMB28:సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా SSMB28.హారిక అండ్ హాసిని క్రియేసన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా కృష్ణ మరణంతో వాయిదా పడింది. ఇక ఇప్పుడిప్పుడే మహేష్ ఆ బాధ నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ఈలోపు మేకర్స్ మ్యూజిక్ సిట్టింగ్స్ పై దృష్టి సారించారు. మహేష్, త్రివిక్రమ్, థమన్, నిర్మాత వంశీ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ కు చేరుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ మాత్రం ఒక యాడ్ కోసం వెళ్లగా.. ఆయనతో పాటు ఈ టీమ్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టనున్నారట.
థమన్ ఈసారి మహేష్ కు మంచి మాస్ మ్యూజిక్ నే అందించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు థమన్ ను ట్రోల్స్ చేస్తున్నారు.. థమన్ ఇచ్చే మ్యూజిక్ కోసం దుబాయ్ వరకు తీసుకెళ్లాలా త్రివిక్రమ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. థమన్, మహేష్ కాంబో చూసుకుంటే కొన్ని బ్లాక్ బూస్టర్లు ఉన్నాయి.. కొన్ని అట్టర్ ప్లాపులు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్- థమన్ కాంబో చూసుకుంటే అల వైకుంఠపురంలో లాంటి మంచి హిట్ సినిమా ఇచ్చాడు. ఈ ఇద్దరితో థమన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.